జిల్లాలో పిడుగు.. భారీగా ఎగసిపడ్డ మంటలు

జిల్లాలో పిడుగు.. భారీగా ఎగసిపడ్డ మంటలు

KRNL: జిల్లాలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కౌతాళం మండలం చూడి గ్రామంలో తాటిచెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. అలాగే హాలహర్వి మండలం గూళ్యంలో పిడుగుపాటుకు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి.