భూకబ్జాదారుల ప్రభుత్వం మనకెందుకు: తేజస్విని

విశాఖ: 45వ వార్డు ఆంజనేయ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో హీరో బాలకృష్ణ రెండో కుమార్తె విశాఖ ఎంపి అభ్యర్థి శ్రీభరత్ భార్య తేజస్విని పాల్గున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. మన భూములు ఆక్రమించి రౌడీయిజంతో దౌర్జన్యం చేస్తున్న వైసీపీ రాజ్యంతో ఇంకెంత కాలం కష్ట పడాలని తేజస్విని పేర్కొన్నారు. ఇలాంటి అరాచక పాలనతో కూడిన భూకబ్జా దారలు మనకెందుకన్నారు.