వైసీపీకి షాక్.. కట్టా సుధాకర్ రెడ్డి రాజీనామా

TPT: సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు నాయుడుపేట జడ్పీటీసీ కట్టా జ్యోతి రెడ్డి, మేనకూరు సర్పంచ్ సురేష్, నాయుడుపేట ఉప ఎంపీపీనలు కస్తూరయ్య, అత్తివరం ఎంపీటీసీ శేఖర్ పార్టీకి రాజీనామా చేశారు.