గౌరవెల్లిలో చిరుత కలకలం

గౌరవెల్లిలో చిరుత కలకలం

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గౌరవెల్లి పెద్దగుట్టలో చిరుత సంచారం కలకలం రేపింది. పొలం వద్దకు వెళుతున్న రైతు జక్కుల రాజుకు చిరుత కనిపించింది. పొదల్లో దాక్కున్న చిరుత గట్టిగా గర్జిస్తూ కొండెంగని చంపి పట్టుకుంది. వారం క్రితం గుట్టపైకి వెళ్లిన లేగ దూడలను తిన్న కలేబారాలు కనిపించాయని స్థానికులు తెలిపారు.