సింహాచలం ప్రసాద తయారీ కేంద్రాల్లో ఈవో తనిఖీ

సింహాచలం ప్రసాద తయారీ కేంద్రాల్లో ఈవో తనిఖీ

VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఈఓ వెంకట్రావు తెలిపారు. ఆదివారం ఆయన ఆలయ పరిసరాలు, అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రసాదాల తయారీ విధానం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తిస్తూ సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.