సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం: ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన 8 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మొత్తం రూ.3,03,593 మంజూరైయ్యాయి. ఈ చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.