పొలం బురదలో పడి రైతు మృతి

పొలం బురదలో పడి రైతు మృతి

JGL: మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన ఎనుగందుల గంగారం అనే రైతు తన పొలం బురదలో పడి ఊపిరాడక మృతి చెందినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. సోమవారం తన పొలానికి నీరు పెట్టే క్రమంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలి బురదలో పడ్డాడు. దీంతో ఊపిరాడక మృతి చెందినట్లు గంగారం భార్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.