VIDEO: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలనే సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని MLA నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను MLA బుధవారం ప్రారంభించారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.