అభయాంజనేయ స్వామి దేవాలయంలో వార్షికోత్సవ పూజలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ కాలనీలో కొలువైన అభయాంజనేయ స్వామి దేవాలయంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.