VIDEO: బైపాస్ రోడ్‌లో పల్టీలు కొట్టిన కారు

VIDEO: బైపాస్ రోడ్‌లో పల్టీలు కొట్టిన కారు

కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఒక కారు పల్టీలు కొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ నుంచి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. గాయపడిన వ్యక్తి‌ని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.