ITBP వేడుకలు.. ముఖ్య అతిథిగా బండి సంజయ్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) 64వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వివిధ బెటాలియన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సరిహద్దుల రక్షణలో ఐటీబీపీ సిబ్బంది చేస్తున్న సేవలను బండి సంజయ్ ఈ సందర్భంగా కొనియాడారు. దేశ రక్షణలో ఐటీబీపీ పాత్ర చాలా ముఖ్యమైందని ఆయన తెలిపారు.