VIDEO: తృటిలో తప్పిన పెను ప్రమాదం
KMR: బిచ్కుంద మున్సిపాలిటీ శివారులోని కందర్పల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై గురువారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గుజరాత్ నుంచి చెన్నై వెళ్తున్న 36,000 లీటర్ల కెమికల్ ఆయిల్ ట్యాంకర్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సుమారు 6,000 లీటర్ల ఆయిల్ లీక్ అయింది. ఘటన స్థలానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళన నెలకొంది.