కాళోజి విశ్వవిద్యాలయంలో MBBS పరీక్ష గందరగోళం

కాళోజి విశ్వవిద్యాలయంలో MBBS పరీక్ష గందరగోళం

WGL: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో MBBS ఫైనల్ ఇయర్ పేపర్-1 పరీక్షలో పేపర్-2 ప్రశ్నలు వచ్చాయి. దీంతో 5 వేల మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు టెక్నికల్ సమస్య అని చెప్పి పరీక్షను రద్దు చేసి, తిరిగి ఈ నెల 27న నిర్వహిస్తామని నోటీసు జారీ చేశారు. అధికారులు నిత్యం ఇలాంటి తప్పులు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.