జిల్లా న్యాయస్థాన సముదాయంలో వైద్య సేవలు

జిల్లా న్యాయస్థాన సముదాయంలో వైద్య సేవలు

NRML: జిల్లా న్యాయస్థాన సముదాయంలో ప్రజలు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వైద్య సేవలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సేవలను ప్రతిరోజూ వినియోగించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.