విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి
MDK: శివంపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గోమారం గ్రామానికి చెందిన నీరుడి రాములు మల్టీపర్పస్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. వీధి దీపాలు సరిచేస్తూ ప్రమాదవశాత్తు స్తంభంపై నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ ఘటనపై గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.