డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించిన ఎస్సై

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా తప్పదని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. వేములపాడులో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఎస్సై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.