నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

JGL: కథలాపూర్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1- 19 సంవత్సరాల మధ్యగల వయస్సు వారికి సోమవారం నులిపురుగుల నివారణ మాత్రలు RBSK వైద్యాధికారి సురేంద్ర పంపిణీ చేశారు. మండలంలో 4వేల మందికి మాత్రలు వేయడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, కథలాపూర్ వైద్యాధికారిణి సింధూజ, హెచ్ఎంలు రవికుమార్, రాజయ్య, శశిధర్, రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.