VIDEO: పని భారాన్ని తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు నిరసన
కోనసీమ: తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. అయినవిల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిమిత పనిగంటలు, యాప్స్ భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, ఇది ప్రాణాల మీదకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.