VIDEO: ఖాకీ డ్రెస్సులో పాఠాలు చెప్పిన సీఐ
E.G: నల్లజర్లలో బుధవారం సీఐ రాంబాబు ఉపాధ్యాయుడిగా మారారు. డ్రగ్స్‌పై అవగాహన సదస్సులో భాగంగా ఆయన హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. కష్టపడి చదివితేనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని హితబోధ చేశారు. డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సీఐ విద్యార్థులకు పిలుపునిచ్చారు.