పోలీసులతో బీఆర్ఎస్ అభ్యర్థి వాగ్వాదం
TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత బోరబండలో పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సునీతను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేసి వారితో వాగ్వాదానికి దిగారు.