నేడు డయల్ యువర్ డీఎం

NDL: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులు, ప్రజలు తమ సమస్యలను, సలహాలు, సూచనలను 9505065651 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.