నకిలీ దస్తావేజులతో భూములు అమ్ముతున్న ముఠా అరెస్ట్

E.G: రాజమండ్రి నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ దస్తావేజులు సృష్టించి విక్రయాలు జరుపుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ బి. విద్య మంగళవారం తెలిపారు. మద్దిరెడ్డి లక్ష్మీ నారాయణ, మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్, యాదగిరి సురేష్, సుబ్బాతి భాస్కరరావు, షేక్ ఫకీర్ మహ్మద్ కాశీం వల్లీ ముఠాగా ఏర్పడి భూములు విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.