VIDEO: ఆలయంలో చోరీ చేసిన దుండగులు

VKB: యాలాల మండలంలోని సంగమేశ్వరుని దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, హుండీ తాళాలు పగలగొట్టారు. హుండీలోని సుమారు రూ.60 వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.