అందెశ్రీ మృతి పట్ల అమిత్ షా సంతాపం

అందెశ్రీ మృతి పట్ల అమిత్ షా సంతాపం

ప్రముఖ కవి అందెశ్రీ మరణం బాధాకరమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రజల గొంతును శక్తివంతం చేయడానికి, తన సృజనాత్మకత ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అందెశ్రీ మరణం మన సాహిత్య, సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.