ఎమ్మెల్యేను కలిసిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు
VZM: జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు సంఘం సభ్యులతో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని సోమవారం ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఉన్న వాసవీమాత ఊరు పేరును వాసవీ పెనుగొండగా మార్పు చేయడంతో ఎమ్మెల్యేకు, సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.