చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం
MDCL: కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ను మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.