ఎన్టీఆర్ హయాంలోనే సంక్షేమం పుట్టింది: వలవల బాబ్జి

ప.గో: సంక్షేమం పుట్టింది ఎన్టీఆర్ హయాంలోనేనని TDP తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ వలవల బాబ్జి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం పట్టణం 15, 28వ వార్డు, బస్టాండ్ సెంటర్, శేషమహల్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.