కార్తీక మాసం.. ఆలయంలో పూజలు
NDL: పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస మొదటి ఆదివారం పూజలను భక్తులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామికి అభిషేకాలు కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.