కుక్కలకు స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ వేయాలి: కలెక్టర్

NLG: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో కుక్కలకు నూటికి నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారితో సమీక్ష నిర్వహించారు. కుక్క కాట్లపై సమీక్ష చేసి, అన్ని మున్సిపాలిటీలలో ఉన్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలని తెలిపారు.