ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు

PDPL: ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఓదెల మండల కేంద్రంలో మామిడి తోటలో కాయలు నేలరాలినట్లు రైతు మంద కుమారస్వామి వాపోయాడు. నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.