మధిర కాలేజీలో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోర్స్
KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ కోర్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. యువత ఉద్యోగాల కోసమే కాకుండా సొంతంగా వ్యాపారాలు చేసేలా ఎదగాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమల నిర్వహణపై ఈ కోర్స్ ద్వారా మెళకువలు నేర్పుతామని తెలిపారు.