సర్పంచ్ అభ్యర్థి మృతి.. గ్రామంలో విషాదం
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామ కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి రాగిపాటి బుచ్చిరెడ్డీ ఆకస్మికంగా మృతి చెందారు. ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండగా ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.