ఇసుక ట్రాక్టర్ల వల్ల ఇబ్బందులు

W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం పండమర గ్రామంలో బొండు ఇసుక రవాణా చేస్తూ ట్రాక్టర్లు రహదారిపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. టాక్టర్లు ఇసుక లోడుపై బరకాలు కప్పకుండా రహదారిపై తిరుగుతుండడంతో వాహనదారులు, గ్రామ ప్రజలకు ఇసుక కళ్ళలో పడితోందని, రహదారిపై వెళ్ళాలంటే భయపడుతున్నామని అంటున్నారు. గ్రామ పంచాయితీ అధికారులు, వీఆర్‌వోలు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.