కారు అదుపుతప్పి చెట్టు ఢీకొని వ్యక్తి మృతి

కారు అదుపుతప్పి చెట్టు ఢీకొని వ్యక్తి మృతి

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన షేక్ రియాజ్ గవిచర్లలోని బంధువుల ఇంటి నుంచి కారులో డ్రైవింగ్ చేస్తూ సొంతూరుకు వెళ్తున్నాడు. మార్గమద్యలో ఏనుగల్లు శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసి చేశారు.