VIDEO: విజయవాడలో మెగా అభిమానుల సందడి

NTR: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన స్టాలిన్ (2006) సినిమా రీ రిలీజ్ విజయవాడలోని థియేటర్లలో అయింది. దీంతో అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్‌కు వచ్చి ఫ్లెక్సీలు, బ్యానర్లతో సందడి చేస్తున్నారు. సినిమాలోని పాటలు, సన్నివేశాలకు విజిల్స్, నినాదాలతో థియేటర్లు దద్దరిల్లాయి. అభిమానులు కేక్ కట్ చేసి, పండగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు.