కుప్పంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

కుప్పంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

CTR: కుప్పం(M) గణేష్ పురం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. ఇటీవల గణేష్ పురం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు నర్సరీ ఏర్పాటుకు చెట్లు నాటారు. అయితే, ఇదే ప్రాంతంలో రాత్రికి రాత్రే కొంత మంది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడాన్ని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు.