ఇందిరా పార్కులో ధర్నా.. మద్నూర్ ఉపాధ్యాయులు

KMR: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద సోమవారం నిర్వహిస్తున్న మహా ధర్నా కార్యక్రమానికి మద్నూర్ మండల కేంద్రం నుంచి పలువురు ఉపాధ్యాయులు బయలుదేరి వెళ్లారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు వి.భీమ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దశరథ్, కమలాకర్, గౌతమ్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.