బహిరంగ ప్రదేశాల్లో మద్యం.. కేసు నమోదు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం.. కేసు నమోదు

GNTR: మంగళగిరి పరిధిలో యర్రబాలెం శివారు, పెనుమాక రోడ్, డొంక రోడ్‌ల వద్ద బహిరంగంగా మద్యం తాగుతున్న పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్థలాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.