మహిళల భద్రతకు 'శక్తి' యాప్: పోలీసులు
సత్యసాయి: మహిళలు, బాలికల భద్రతే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ 'శక్తి' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని శక్తి టీం బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. సోమవారం పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు, మహిళలకు యాప్ గురించి వివరించారు. ఆపద సమయంలో SOS బటన్ నొక్కితే పది నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారని తెలిపారు. సైబర్ నేరాలు, వేధింపులపై డయల్ 100/112/181కు ఫోన్ చేయాలన్నారు.