'ఇంటి ఆహారమే ఆరోగ్యానికి మేలు'

'ఇంటి ఆహారమే ఆరోగ్యానికి మేలు'

BPT: పోలూరు గ్రామంలో పోషణ పక్వాడలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుజాత మాట్లాడుతూ.. చిన్నారులకు ప్యాకెట్ ఫుడ్ ఇవ్వకుండా ఇంట్లో తయారు చేసే పోషకాహారం ఇవ్వాలని తల్లులకు సూచించారు. గర్భిణీలు, శిశువుల తొలి 1000 రోజుల సంరక్షణ ఎంతో ముఖ్యమని వివరించారు. కార్యక్రమంలో జీ.శ్రీలత తదితరులు పాల్గొన్నారు.