హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

JGL: హనుమాన్ జయంతి సందర్భంగా మెట్‌పల్లిలోని కాశీబాగ్ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆలయానికి విచ్చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణం హనుమాన్ భక్తులతో నిండిపోయింది.