'పక్కా ఓటరు తయారీకి సహకరించాలి'

VZM: పక్కా ఓటరు జాబితా తయారీకి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు సహకరించాలని నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూకరాజు సూచించారు. తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా తయారీకి సహరించాలని కోరారు.