నంద్యాలలో వీధి కుక్కల నియంత్రణలో విఫలం

NDL: వీధి కుక్కల సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో, శుక్రవారం ఎస్టీపీఐ నేతలు మున్సిపాలిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంటీ రాబిస్ వ్యాక్సిన్ లోపంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాస్ హుస్సేన్ విమర్శించారు. ఈ మేరకు అసెంబ్లీ అధ్యక్షుడు వి. హనీప్, ఉపాధ్యక్షుడు మాజీద్ ఖాన్ సహా పలువురు నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.