మృతదేహాన్ని చూడటానికి వెళ్లి అనంతలోకాలకు..
AP: కర్నూలులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆ మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన వారిని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.