అమరావతిలో వేల కోట్ల అవినీతి: శ్రీకాంత్ రెడ్డి
AP: ప్రజాధనం వృధా కాకూడదనే 'మావిగన్' ప్రతిపాదన అని YCP నేత శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.2 లక్షల కోట్లతో కేవలం అమరావతినే నిర్మిస్తే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీని వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు.