ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు

ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు

KNR: మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామం నుండి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్‌ను పోరండ్ల గ్రామ శివారులో ఎల్ఎండీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌లు పోలీస్ స్టేషన్ తరలించారు. ట్రాక్టర్ యజమాని మొగిలిపాక అవినాష్, ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల అనిల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.