'పెండింగ్ జీతాలతో పాటు ఫిక్స్‌డ్ వేతనాలు ఇవ్వాలి'

'పెండింగ్ జీతాలతో పాటు ఫిక్స్‌డ్ వేతనాలు ఇవ్వాలి'

KNR: జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.పెండింగ్ జీతాలతో పాటు ఫిక్స్‌డ్ వేతనాలు ఇవ్వాలని పని భారం తగ్గించాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో ఆశ వర్కర్లను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవడం లేదనివాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే విడతల వారిగా ఉద్యమం చేసి తమ హక్కులు సాధించుకుంటామని పేర్కొన్నారు.