విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా బోధన

KMM: ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల లక్ష్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఆదివారం వైరాకు వచ్చిన భట్టి గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఇదే ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యాన స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు.