నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

E.G:పెరవలి మండలం తీపర్రులో రూ. 3.24 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన 9.6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రహదారి నిర్మాణం వల్ల 4 గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగవుతుందన్నారు. నాణ్యతకు రాజీ లేకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో రూ. 25 లక్షలతో రెండు రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.