వేలం జాప్యం.. వేచి చూసిన అభ్యర్థులు
NZB: బోధన్ పరిధిలోని తైబజార్, స్లాటర్ హౌస్ వేలం పాట నిర్వహణలో జాప్యం నెలకొంది. మున్సిపల్ సమావేశ భవనంలో ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ, మధ్యాహ్నం 12 గంటలు దాటిన మొదలుకాకపోవడం గమనార్హం. వేలం కోసం వచ్చిన అభ్యర్థులు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వేలంలో పాల్గొన్నారు.